పవన్ కళ్యాణ్‌పై ఏపీ మంత్రుల ఎదురు దాడి

Update: 2019-09-15 06:01 GMT

ఏపీ సీఎం జగన్ వంద రోజుల పాలనపై సంచలన వ్యాఖ్యలు చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జగన్ వంద రోజుల పాలన ప్రణాళిక బద్ధంగా లేదన్నారు. సంవత్సరం వరకు జగన్ పాలనపై మాట్లాడే అవకాశం తనకు రాదనుకున్నానని, కానీ మూడునెలల్లోపే వైసీపీ పాలనపై మాట్లాడే అవకాశం కల్పించారన్నారు. జనరంజకమైన జనవిరుద్ధ పాలనగా వైసీపీ పాలనను అభివర్ణించారు జనసేనాని. దీంతో పవన్‌పై మండిపడుతున్నారు వైసీపీ నేతలు.

ఏపీలో జగన్ సర్కార్ వంద రోజుల పాలనపై జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. జగన్ వంద రోజుల పాలనపై ప్రణాళికా బద్ధంగా లేదన్నారు. నవరత్నాలు జనరంజకమైనవే అయినా వాటిని జనవిరుద్ధంగా అమలు చేస్తున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు. అలాగే, ఏపీలో కియా పరిశ్రమ స్థాపించిన సీఈఓను స్థానిక వైసీపీ నేతలు అవమానించారన్నారు పవన్. ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా ? అంటూ పవన్ ప్రశ్నించారు. విలేజ్ వాలంటీర్లది కొరియర్ సర్వీస్‌లా ఉందన్నారు. వైసీపీ క్యాడర్ కోసమే వాలంటీర్ల వ్యవస్థ అంటూ మండిపడ్డారు పవన్.

వైసీపీ మేనిఫెస్టో అమలుకు 50వేల కోట్లు కావాలన్న పవన్ రాష్ట్రానికి 2.59 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. పోలవరం నిర్మాణంలో అవకతవకలు ఉంటే సరిచేయాలి కానీ టెండర్లను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు జనసేనాని. బొత్స తన ఆస్తుల్ని అమ్మి పోలవరాన్ని పూర్తిచేస్తారా అంటూ పవన్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇసుకే లేకుండా చేశారని, వందరోజుల్లో ఇసుక పాలసీని తీసుకురాలేకపోయారని మండిపడ్డారు పవన్.

అయితే, జనసేనాని చేసిన ఈ వ్యాఖ్యలకు వైసీపీ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. పవన్‌పై మంత్రులు అవంతి శ్రీనివాస్, బొత్స సత్యనారాయణలు మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతి, పోలవరంలో జరిగిన అవినీతికి పవన్‌ అనుకూలమా ఇసుక దోపిడీ ఎలా జరిగిందో పవన్‌కు తెలియదా రాజధానిపై యూటర్న్‌ తీసుకున్నారని మండిపడ్డారు. నవరత్నాలకు పవన్ అనుకూలమా వ్యతిరేకమో చెప్పాలన్నారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న పవన్‌ తనకు ఓట్లు వేసిన గాజువాక నియోజకవర్గం ప్రజల్ని కలిశారా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు పవన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. మొత్తం మీద జగన్ సర్కార్ వందరోజుల పాలన జనసేన, వైసీపీ మధ్య యుద్ధం మొదలైంది.  

Full View

Tags:    

Similar News