హాట్స్ ఆఫ్ : అర్ధరాత్రి వలస కూలీల ఆకలి తీర్చిన విజయనగరం ఎస్పీ!

కరోనా వైరస్ వ్యాప్తికి లాక్ డౌన్ సరైనా మార్గంగా ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సొంత నివసాలకి వెళ్ళాలి అనుకున్న వలస కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది.

Update: 2020-05-17 03:20 GMT

కరోనా వైరస్ వ్యాప్తికి లాక్ డౌన్ సరైనా మార్గంగా ఎంచుకుంటూ ముందుకు వెళ్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడంతో సొంత నివసాలకి వెళ్ళాలి అనుకున్న వలస కూలీల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. బస్సులు , రైళ్లు లేకపోవడంతో ఆకలితో అలమటిస్తూ మండుటెండలను సైతం లెక్కచేయకుండా తమ సొంత వాళ్ళతో కలిసి కాలినడకన వారు ప్రయాణం చేస్తున్న ఘటనలు మనం రోజుకు చాలానే చూస్తున్నాం.. అలాంటి ఘటనలు మనల్ని కంటతడి పెట్టిస్తున్నాయి.

అయితే అలాంటి వారిని ఆదుకోవడానికి కొందరు ముందుకు వచ్చి తమ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. అందులో భాగంగానే అర్ధరాత్రి వేళ ఓ మహిళ పోలీస్ అధికారి తానే స్వయంగా వంట చేసి కొంతమంది వలస కూలీల ఆకలి తీర్చింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు. విజయనగరం జిల్లాఎస్పీ రాజకుమారి! ... ఇక వివరాల్లోకి వెళ్తే.. శుక్రవారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో ఓ మహిళ నుంచి ఎస్పీకి ఫోన్‌ వచ్చింది. తనతోపాటు మరో పది మంది మహిళలు ఆకలితో అలమటిస్తున్నామని అందులో పేర్కొంది.

దీనితో చలించిపోయున ఆమె తన అసిస్టెంట్ సహయాంతో వంట గదిలోకి వెళ్లి స్వయంగా లేమాన్ రైస్ చేసి అర్ధరాత్రి 1.00 గంట ప్రాంతంలో వలస కూలీలు ఉన్నచోటికి ఆమె స్వయంగా వెళ్లి ఆహారాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. గత మూడు రోజుల క్రితం మేము నెల్లూరు జిల్లా సూళ్లురుపేట నుంచి తాము బయలుదేరామని మధ్యలో మాకు ఎక్కడ కూడా ఆహారం దొరకలేదని, తెచ్చుకున్న డబ్బులు కూడా అయిపోయాయని వెల్లడించారు.

ఈ క్రమంలో విజయనగరం చెక్ పోస్ట్ వద్ద ఆహారం లభిస్తుందనే ఆశపడ్డాము కానీ దొరకలేదు. దీంతో గ్రామంలోని తమ బంధువులకు ఫోన్ చేయడంతో ఎస్పీ నంబర్ ఇచ్చారని తెలియజేశారు.

Tags:    

Similar News