కుక్క కోసం రెండు కుటుంబాల మధ్య ఘర్షణ

Update: 2019-07-24 06:42 GMT

పెంపుడు కుక్క కోసం రెండు కుటుంబాలు రక్తం వచ్చేట్టు కొట్టుకున్నాయి. నెల్లూరు జిల్లా వెంకటగిరి బొగ్గులమిట్ట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా నివసిస్తున్న భూమన కుటుంబానికి చెందిన పెంపుడు కుక్క నిన్న కనిపించకుండా పోయింది. అయితే భూమన ఇంటికి సమీపంలో నివాసమంటున్న తులసికి కుక్క రోడ్డుపై కనిపించింది. దీంతో ఆమె ఆ కుక్కను ఇంటికి తీసుకుపోయింది. ఇదే అసలు గొడవకు కారణమైంది.

తప్పిపోయిన కుక్క కోసం వెతుకుతున్న భూమన కుటుంబ సభ్యులకు తులసి ఇంట్లో తమ కుక్క కనిపించింది. దీంతో వారు తులసితో వాగ్వాదానికి దిగారు. ఇది చినికి చినికి గాలివానలా మారి ఘర్షణకు దారి తీసింది. భూమన కుటుంబానికి చెందిన వారు తులసి, ఆమె తల్లి, తమ్ముడిని తీవ్రంగా గాయపరిచారు.

తీవ్రంగా గాయపడిన కుటుంబ సభ్యులను వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Full View

Tags:    

Similar News