Coronavirus: కర్నూల్ లో రెండు కరోనా అనుమానిత కేసులు!

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇక భారత్ లో ఇప్పటికి 81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Update: 2020-03-14 01:48 GMT
Two corona suspected cases in Kurnool

కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తుంది. చైనాలో మొదలైన మహమ్మారి ఇప్పుడు ప్రపంచ దేశాలకి వ్యాపించి ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఇక భారత్ లో ఇప్పటికి 81 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇక ఏపీలోని నెల్లూరులో మొదటి పాజిటివ్ కేసు నమోదు కావడంతో నగర పరిధిలోని పాఠశాలలు, సినిమా థియేటర్లను ఈ నెల 18వ తేదీ వరకు వరకు మూసివేయాలని కలెక్టర్‌ ఎంవీ శేషగిరిబాబు ఆదేశించారు.

ఇక ఇది ఇలా ఉంటే ఇప్పుడు వైఎస్సార్ జిల్లా కడపలోనూ రెండు అనుమానిత కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కడప రిమ్స్‌లో వీరికి చికిత్స అందిస్తున్నారు. కడపలోని బెల్లమండి వీధికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం సౌదీ అరేబియాలోని మక్కా నుంచి కడప నగరానికి తిరిగి వచ్చింది. ఇక మరో వ్యక్తి కూడా రెండు రోజుల క్రితం గల్ఫ్‌ నుంచి కడపకు వచ్చాడు. ఇద్దరికీ వీపరితమైన జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసంతో భాదపడతూ ఉండడంతో వీరిని రిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ఇక సుమారు 125 దేశాలకు ఈ కరోనా వైరస్‌ విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా మొత్తం లక్షా 30వేల 237 కేసులు నమోదయ్యాయి. అందులో 68వేల 677 మంది చికిత్స తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇంకా 56వేల 804 మంది చికిత్స పొందుతున్నారు. 5వేల 714 మందికి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొత్తగా వెయ్యి 600 కేసులు నమోదయినట్లు సమాచారం. కరోనాతో మొత్తం ఇప్పటి వరకు 4వేల 756 మంది మృతి చెందినట్లు సమాచారం. 



Tags:    

Similar News