పిల్లచేష్టలు .. ప్రాణాల మీదికి తెచ్చింది

Update: 2020-02-28 18:30 GMT
పిల్లచేష్టలు .. ప్రాణాల మీదికి తెచ్చింది

చిన్నప్పడు చిన్నపిల్లలు చాలా అల్లరి పనులు చేస్తూ ఉంటారు. ఆ అల్లరి పనులు సరదా వరకు అయితే బాగుంటుంది కానీ ఒక్కోసారి ఈ అల్లరి పనులే ప్రాణాలమీదికి కూడా తీసుకువస్తాయి. ఇప్పుడు అలాంటి సంఘటనే గుంటూరులో చోటు చేసుకుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. గుంటూరులోని ఓ ఇద్దరు పిల్లలు చిన్న సందులోకి దూరారు.. సందులోకి సగం దూరక అటు ముందుకు ఇటు వెనకకి వెళ్ళలేక నానాతంటాలు పడ్డారు. ఇదే క్రమంలో ఇద్దరికీ శ్వాస తీసుకునేందుకు కూడా ఇబ్బంది ఏర్పడింది. స్థానికులు, స్కూల్ ఇబ్బంది దీనిని గమనించి ఎట్టకేలకు వారిని బయటకు తీశారు.

తాడేపల్లిలోని నులకపేట ఉర్దూ స్కూల్ ప్రహరీ గోడ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. రమణబాబు, మున్నా అనే ఈ ఇద్దరు పిల్లలు సరదాగా ఆడుకుంటూ పక్కనే ఉన్న ప్రహరీ గోడ, మరో గోడకు మధ్య ఇరుక్కుపోయారు. ముందుకు వెనకకి వెళ్ళలేక అరవడంతో స్థానికులు వీరని గుర్తించి అతికష్టం మీదా వీరని బయటకు తీశారు.

ఇందులో వారికి స్వల్ప గాయాలు అయ్యాయి. ఇక తమ బిడ్డలు ప్రాణాలతో బయటకు రావడంతో తమ బిడ్డలను చూసుకుని ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనపైన పోలీసులు స్పందిస్తూ.. పిల్లలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పుడు ఎం చేస్తున్నారో గమనిస్తూ ఉండాలని, ఆ సందును మూసివేయాలని ఆదేశించారు.

Tags:    

Similar News