పోలీసులతో అచ్చెన్నాయుడు వాగ్వాదం..యూజ్ లెస్ ఫెలోస్ అంటూ..

Update: 2019-09-11 04:09 GMT

పోలీసులపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు చిందులు వేశారు. చంద్రబాబు ఇంటికి వెళ్లకుండా తనని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై తీవ్ర పదజాలంతో దూషించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్‌ని ఉద్దేశించి యూజ్ లెస్ ఫెలోస్ అంటూ వ్యాక్యానిచ్చారు. చంద్రబాబు నివాసానికి బయలుదేరిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పోలీసులు అడ్డుకున్నారు. టూ వీలర్ పై వస్తుండగా అడ్డుకున్న పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్బంగా పోలీసులతో అచ్చెన్నాయుడికి తీవ్ర వాగ్వాదమైంది. తనను ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పాలంటూ అచ్చెన్నాయుడు పోలీసులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా పోలీసులపై తీవ్ర పదజాలంతో దూషించారు.  

Full View

Tags:    

Similar News