విశాఖలో మురళీ మోహన్ షోరూమ్ కూల్చివేత

Update: 2019-06-27 12:04 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అక్రమ నిర్మాణాలపై కొరడా ఝళిపిస్తున్నారు. అమరావతిలో ప్రజావేదికను కూల్చేయించిన ఆయన ఇతర నగరాలపైనా దృష్టి సారిస్తున్నారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా ఇళ్లు, దుకాణాలు, ఇతర కట్టడాలు నిర్మించిన వారికి నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విశాఖ అధికారులు రంగంలోకి దిగారు. టీడీపీ మాజీ ఎంపీ, ప్రముఖ నటుడు మురళీ మోహన్‌కు చెందిన కార్ల షోరూమ్‌ను నేలమట్టం చేశారు.

జోన్‌-2లోని ఎంవీపీ సెక్టార్‌-11లో నిబంధనలకు విరుద్ధంగా జయభేరి ట్రూ వ్యాల్యూ కార్‌ షోరూమ్‌ను నిర్మించారు. వెయ్యిగజాల స్థలంలో ఉన్న ఇందులో పాతకార్ల అమ్మకాలు, కొనుగోళ్లు సాగుతున్నాయి. దీనికి ప్లాన్ లేకపోవడంతో కూల్చేయాలని కమిషనర్‌ జి.సృజన ఆదేశించారు. బుధవారం మునిసిపల్ సిబ్బంది బుల్డోజర్లు తీసుకొచ్చి షోరూమ్‌ను పడగొట్టారు. టీడీపీకి చెందిన పలువురు నేతల భవనాలు కూడా లిస్టులో ఉన్నట్లు తెలుస్తోది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన భీమిలిలో క్యాంప్‌ కార్యాలయం, ద్వారకానగర్‌లోని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‌ ఇళ్లను కూల్చేయడానికి రంగం సిద్ధమైంది

Tags:    

Similar News