పక్కదారి పడుతున్న వేరుశెనగ విత్తనాలు

Update: 2019-07-06 05:51 GMT

వేరుశెనగ విత్తనాల కోసం రాయలసీమలో రైతులు ఆందోళన చేస్తుంటే మరో వైపు వేరుశెనగ విత్తనాలు పక్కదారి పడుతున్నాయి. రాత్రికి రాత్రే అనంతపురం జిల్లా వ్యాపారులు గూడ్స్ ఆటోల్లో వేరుశెనగ విత్తనాలను కర్నాటకకు తరలిస్తున్నారు. అధికారులతో కుమ్మక్కై సొమ్ము చేసుకుంటున్నారు. సోమందేపల్లి మండలం మేకల పల్లి లో ఓ వ్యాపారి అక్రమంగా నిల్వ ఉంచిన సబ్సిడీ వేరుశనగ బస్తాలను రాత్రి వేళ ప్రత్యేక వాహనాల్లో కర్ణాటక లోని పవగడకు తరలించారు. పవగడలోని ఆయిల్ మిల్ కు గూడ్స్ ఆటోలో వేరుశెనగ విత్తనాలను చేర్చారు. ఇదే తరహాలో కళ్యాణదుర్గం, రాయదుర్గం, ఉరవకొండ నియోజకవర్గ ల నుంచి వ్యాపారులు కర్నాటకకు వేరుశెనగ విత్తన కాయలను తరలిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News