మంత్రి అవంతి, ద్రోణంరాజు మధ్య రగడ

Update: 2019-09-30 15:38 GMT

వార్డు-గ్రామ సచివాలయ ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ సందర్భంగా విశాఖలో మంత్రి అవంతి, వీఎంఆర్‌డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజు శ్రీనివాస్ మధ్య రగడ జరిగింది. వలసలపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అవంతి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటూ ఎంపికైన అభ్యర్థులకు సూచించారు. ఓ సందర్భంలో వీఎంఆర్డీఏ ఛైర్మన్‌ ద్రోణంరాజును ఉద్దేశిస్తూ అవంతి చేసిన వ్యాఖ్యలు స్వల్ప వాగ్వాదానికి దారితీశాయి. నగరంలో పెరిగిన ద్రోణంరాజుకు గ్రామాల్లోని సమస్యలు తెలియవని మంత్రి అవంతి వ్యాఖ్యానించారు. అవంతి వ్యాఖ్యలపై ద్రోణంరాజు శ్రీనివాస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను గ్రామస్థాయి నుంచే వచ్చానని, సమస్యలపై పూర్తి అవగాహన ఉందన్నారు. తాను పుట్టింది కూడా ఓ కుగ్రామంలోనేనన్న ద్రోణంరాజు మాట్లాడే ముందు చిన్నాపెద్ద తేడా తెలుసుకుని మాట్లాడాలని కౌంటరిచ్చారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోయినా, జగన్మోహన్ రెడ్డి తనకు పదవి ఇచ్చారని, వలసదారులు ఎవరైనా కావాలంటే, దీన్ని కూడా ఇచ్చేస్తానన్నారు. అనంతరం అవంతి మాట్లాడుతూ తన మాటలను ద్రోణంరాజు అపార్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.

Tags:    

Similar News