రాజమహేంద్రవరంలో వలస కూలీల ఆందోళన

Update: 2020-05-06 06:49 GMT

బతుకు దెరువు కోసం వివిధ రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారు. వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు ఆరాట పడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు పనులకోసం బిహార్‌, జార్ఖండ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాల నుంచి దాదాపు 400 మంది వలస కూలీలు వచ్చారు. కరోనా వైరస్‌ లాక్‌డౌన్‌ నేపథ్యంలో వీరందరినీ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నన్నయ వర్సిటీలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో ఉంచారు.

వలసకూలీలను స్వస్థలాలకు పంపేందుకు అనుమతిస్తున్నట్టు కేంద్రం ప్రకటించడంతో స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు వారంతా సిద్ధమయ్యారు. ఈ ఉదయం వీరంతా రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు లాలా చెరువు కూడలి వద్ద అడ్డుకునేందుకు ప్రయత్నించినా వారు పట్టించుకోకుండా ముందుకుసాగారు. ప్రత్యేక రైళ్లలో తమను సొంతూళ్లకు పంపాలని డిమాండ్ చేశారు. ఇప్పటికిప్పుడు రైళ్లు సాధ్యం కాదని, కొంత సమయం ఇవ్వాలని పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో కూలీలు ఆందోళనకు దిగారు.


Tags:    

Similar News