ఫైనల్ గా కొణతాల చేరేది ఏ పార్టీలో అంటే..

Update: 2019-03-22 01:51 GMT

మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ టీడీపీలో చేరనున్నట్టు ప్రచారం జరుగుతోంది. గత మూడు రోజులుగా ఆయన అనకాపల్లిలోని తన కార్యాలయంలో అనుచరులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే చాలా మంది అనుచరులు వైసీపీలో చేరాలని సూచించినా.. దాడి వీరభద్రరావు చేరికతో వైసీపీలోకి వెళ్లడం తనకి ఇష్టం లేదని కొణతాల వారితో అన్నట్టు తెలుస్తోంది.

ఈ క్రమంలో టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు కొణతాల అనుచరులు చెబుతున్నారు. ఇదిలావుంటే వైసీపీలో చేరడంకోసం గత వారం వైసీపీ అధినేత జగన్ ను కలిశారు కొణతాల. అయితే సీటు ఇవ్వనని జగన్ చెప్పడంతో ఆయన టీడీపీ వైపు చూస్తున్నారు. రెండు రోజుల్లో ఆయన టీడీపీలో చేరే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. 

Similar News