సలామ్ పోలీస్ భాయ్ ... నడిరోడ్డుపైనే నమాజ్

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే..

Update: 2020-04-27 14:23 GMT
ASI Prays Namaz

కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే.. ప్రజలు ఎవరు బయట రాకుండా ప్రభుత్వాలకి సహకరించాలని కోరుతున్నాయి. అయితే ఈ కరోనా పోరాటంలో ప్రభుత్వంతో పాటు వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు. ప్రస్తుతం వారిని దేశప్రజలు దైవంగా భావిస్తున్నారు. ఇక ఇందులో పోలీసులు ప్రజలు లాక్ డౌన్ ని కచ్చితంగా పాటించేలా చూస్తూ తమ విధులను నిర్వర్తిస్తున్నారు.

అయితే ఈ సమయంలోనే ముస్లింలు పవిత్రంగా పాటించే రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం అయ్యాయి. అయినప్పటికీ సెలవులు తీసుకోకుండా తమ విధులను నిర్వర్తిస్తున్నారు. ఓ వైపు విధులు నిర్వర్తిస్తూనే అక్కడే నమాజ్ చేసుకుంటున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో పనిచేస్తోన్న ఏఎస్ఐ ఖరీముల్లా ఆదివారం లాక్‌డౌన్ విధులు నిర్వర్తిస్తున్నాడు. రంజాన్ మాస ఉపవాస దీక్షలు ప్రారంభమవ్వడంతో నమాజ్ వేళ కావడంతో అక్కడే ఎర్రటి ఎండలో రోడ్డుపై ప్రార్థనలు చేసి ఉపవాస దీక్షను విరమించాడు.

ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన వృత్తి పట్ల అంకితభావం చూపిస్తూనే మరోపక్కా ఉపవాస దీక్షను ఆచరించడం పట్ల నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సలామ్ పోలీస్ భాయ్.. సరిలేరు నీకెవ్వరూ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.  




 

Tags:    

Similar News