జగన్‌ను ఆకాశానికి ఎత్తేసిన గవర్నర్ నరసింహన్

Update: 2019-07-22 15:59 GMT

 ఆంధ్రప్రదేశ్‌కు నూతన గవర్నర్‌ను నియమించడంతో ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి గవర్నర్‌‌గా పనిచేసిన నర్సింహన్‌కు ఏపీ సర్కార్‌ గ్రాండ్ సెండాఫ్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి దంపతులతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ముఖ్యనేతలు నర్సింహన్‌ వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. నర్సింహన్‌ మరికొన్ని రోజులు ఏపీ గవర్నర్‌గా కొనసాగి ఉంటే బాగుండేదన్నారు. తాను ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి మాదిరిగా ముందుండి నడిపించారని అన్నారు.

ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్‌‌రెడ్డిపై నర్సింహన్‌‌ పొగడ్తల వర్షం కురిపించారు. జగన్‌ 30రోజుల పాలన అద్భుతంగా ఉందంటూ ప్రశంసించారు. ప్రతీ బాల్ బౌండరీ, సిక్సర్‌ను తాకుతున్నట్లు ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని సెంచరీలు సాధించాలని కోరుకుంటున్నట్లు గవర్నర్ నర్సింహన్‌ వ్యాఖ్యానించారు. గవర్నర్‌గా ఈ నరసింహం వెళ్లిపోతున్నా అహోబిలం, సింహాచలం, మంగళగిరి నరసింహులు మీతోనే ఉంటారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి, అవినీతిరహిత రాష్ట్రం కోసం వైఎస్‌ జగన్‌ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగాలి. నాకు సహకరించిన మంత్రులు, అధికారులకు కృతజ్ఞతలు' అని తెలిపారు.

Full View

Tags:    

Similar News