హైదరాబాద్ లోని ఆక్రమణ స్థలంలో జగన్ భారీ బిల్డింగ్ ను లేపారు.. ఇప్పుడు నీతులు చెబుతున్నారు!: దేవినేని ఉమ ఆరోపణ

Update: 2019-06-26 11:29 GMT

తమది కన్ స్ట్రక్షన్(నిర్మాణాత్మక) ప్రభుత్వం అయితే వైసీపీది డిస్ట్రక్షన్(విధ్వంసకరమైన) ప్రభుత్వం అని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. అసలు వైసీపీ నేతలు ఎందుకు ఎగిరిఎగిరి పడుతున్నారని ప్రశ్నించారు. ప్రజావేదిక అన్నది ప్రభుత్వ ఆస్తి అనీ, ముఖ్యమంత్రి జగన్ దానికి కస్టోడియన్ అని స్పష్టం చేశారు. కోట్లాది రూపాయలతో నిర్మించిన ప్రభుత్వ భవనాన్ని ఈ వానలో అధికారులను మోహరించి కూలగొట్టే ప్రయత్నిం చేస్తున్నారని దుయ్యబట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబుతో ఈరోజు భేటీ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు.

'హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రోడ్డు నంబర్ 2లో వైఎస్ ప్రతిపక్ష నేతగా, సీనియర్ శాసనసభ్యుడిగా తన కుటుంబంతో కలిసి ఉండేవారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మంత్రి షబ్బీర్ అలీ దాన్ని క్రమబద్ధీకరణ చేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ దాన్నిరాజ్ టవర్స్ గా మార్చి పేద్ద కాంప్లెక్స్ ను కట్టారు. బ్యాంకులు, కంపెనీలకు అద్దెలకు ఇచ్చారు. ఇలా వైఎస్ ప్రతిపక్షం నుంచి అధికారంలోకి రాగానే అక్రమ కట్టడం కాస్తా, సక్రమ కట్టడం అయిపోయింది. ఇక హైదరాబాద్ లోని లోటస్ పాండ్ (జగన్ నివాసం) దగ్గర చెరువు భూములను కూడా రెగ్యులరైజ్ చేసుకున్నారు. అక్కడే పేద్ద భవన నిర్మాణం చేసుకుని ఇక్కడికి వచ్చి జగన్ మోహన్ రెడ్డి నీతులు చెబుతున్నారు' అని ఉమ ఘాటుగా విమర్శించారు.

Tags:    

Similar News