నిబంధనలు చదువుకుంటే తెలుస్తుంది: చంద్రబాబుకి జగన్ చురకలు

Update: 2019-07-17 07:23 GMT

ఏపీ అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుల మధ్య మాటల మంటలు చెలరేగాయి. టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు సీటు తొలగించడం ఇరువురి మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ప్రభుత్వం కక్ష సాధింపులకు పాల్పడుతోందని నారా చంద్రబాబు నాయుడు ఆరోపించగా.. నిబంధనలు చదువుకుంటే తెలుస్తుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి చురకలు అంటించారు. కేటాయించిన సీట్లలో కూర్చోవాలని స్పీకర్‌ రూలింగ్‌ ఇచ్చారు. 40 సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తయినా సరే నిబంధనలు పాటించాల్సిందే. మొట్టమొదటి సార ఎమ్మెల్యేగా ఎన్నికైనా..రెండోసారి ఎన్నికైనా.. ఎవరైనా చట్టసభలోనే కూర్చుంటారు కదా అని సీఎం జగన్ అన్నారు. ఉద్దేశపూర్వకంగానే టీడీపీ సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తున్నారని సీఎం జగన్ మండిపడ్డారు.  

Tags:    

Similar News