ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు జగన్ క్లాసులు..ప్రతిపక్షం ఉంటేనే..

Update: 2019-07-03 15:38 GMT

అసెంబ్లీలో సభ్యులందరికీ మాట్లాడేందుకు అవకాశం కల్పించి సభను హుందాగా నడిపిద్దామన్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. చట్టసభలో చేసే చట్టాలను సభ్యులు గౌరవించాలని సూచించారు. అసెంబ్లీ రూల్స్‌ గురించి ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలన్నారు సీఎం జగన్ అసెంబ్లీ కమిటీ హాల్ లో నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరైన జగన్ సభ్యులకు క్లాస్ తీసుకున్నారు.

శాసనసభలో అనుసరించాల్సిన నియమనిబంధనల గురించి ప్రతి సభ్యుడు తెలుసుకోవాలన్నారు ఏపీ సీఎం జగన్. అమరావతిలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు నిర్వహించిన శిక్షణా తరగతుల కార్యక్రమంలో పాల్గొన్న సీఎం సభలో ఎలా ఏవిధంగా వ్యహరించాలో దిశానిర్దేశం చేశారు. అధికార సభ్యుడు అయినంత మాత్రాన స్పీకర్‌ అవకాశం ఇస్తారని ఎవరూ అనుకోవద్దు నిబంధనల ప్రకారం ఎమ్మెల్యేలు అడిగితేనే అవకాశం దక్కుతుందన్నారు.

సభకు హజరయ్యే సభ్యులు పూర్తి సమాచారంతో రావాలని ఎవరు ఏ సబ్జెక్టుపై మాట్లాడాలని అనుకుంటున్నారో ముందుగా జాబితా ఉంటుందని సమాచారం లేకుండా మాట్లాడితే ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు సీఎం జగన్. ముఖ్యంగా ఇతర పార్టీ సభ్యులతో సమన్వయం చేసుకుంటూ సభ్యులు మాట్లాడినట్లయితే ప్రభుత్వం నుంచి కావాల్సిన సమాచారం వస్తుందన్నారు. ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు ముందు కసరత్తు చేయ్యాలని ఎంత గొప్ప స్పీకర్ అయిన అసెంబ్లీలో ఫెయిల్‌ అవుతారన్నారు సీఎం జగన్. నిబంధనల ప్రకారం స్పీకర్‌ వ్యవహరిస్తారని ప్రతి అంశంపై సభ్యుడు అవగాహన పెంచుకోవాలని సూచించారు. సభా సమయాన్ని వృధా చేయరాదన్నారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో తాను తెల్లవారుఝాము నాలుగు గంటలకే ప్రిపేర్ అయ్యేవాడినని గుర్తు చేశారు సీఎం జగన్.

గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఇప్పటి సభలో ఉండదని సభలో ప్రతిపక్షం ఉంటేనే బాగుటుందన్నారు సీఎం జగన్. మైకులు కట్ చేయడం వంటివి సభలో ఉండవన్నారు. సభలో మాట్లాడే వారందరికి అవకాశం కల్పిస్తామన్నారు. సభలో మోసాలు, అబద్ధాలు అవాస్తవాలు చెప్పొద్దని చర్చ జరిగే అంశంపై పూర్తి అవగహానతో రావాలని సభ్యులు ఎవరూ సమావేశాలకు గైర్హాజరు కావద్దని కోరారు. ప్రజలు ఎన్నుకున్నది సమస్యలు సభలో ప్రస్తావించేందుకు అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. 

Tags:    

Similar News