రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్‌

Update: 2020-02-06 11:36 GMT
రైతు భరోసా కేంద్రాల లోగోను ఆవిష్కరించిన సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాలను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, వచ్చే మే నెలలోపు అన్ని ఏర్పాట్లు జరగాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలో అగ్రి మిషన్‌, కొనుగోలు కేంద్రాల తీరు, రైతులకు లభిస్తున్న ధరలపై సీఎం వైఎస్‌ జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు భరోసా కేంద్రాల లోగోను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆవిష్కరించారు.

భవిష్యత్తులో భరోసా కేంద్రాలు సేకరణ కేంద్రాలుగా కూడా మారాలని జగన్ సూచించారు. రైతులకు అందించే గిట్టుబాటు ధరను రైతు భరోసా కేంద్రాల్లో బోర్డుల ద్వారా ప్రకటించాలని సీఎం సూచించారు. రైతు భరోసా కేంద్రాలను ఆవిష్కరించిన సీఎం జగన్ విత్తనాల కొనుగోలు బుకింగ్ చేసుకునే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు. ఈ సమావేశంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, బాలినేని శ్రీనివాస్‌, కురసాల కన్నబాబు, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కొడాలి నాని, సీఎస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News