తూర్పుగోదావరి జిల్లాలోని గండి పోశమ్మ ఆలయం మూసివేత

Update: 2019-09-08 02:08 GMT

గోదావరి వరద పోటెత్తడంతో తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గొందూరులోని గండిపోశమ్మ ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. పోశమ్మ ఆలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. గోదావరి నది ఒడ్డునే అమ్మవారి ఆలయం వుండటంతో క్రమంగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద తాకిడి తగ్గిన తర్వాత మళ్లీ ఆలయం తెరువనున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. గత నెలలోనూ వరద వచ్చిన సందర్భంలో పది రోజులకు పైగా ఆలయం జలదిగ్భంధంలో ఉండిపోయింది. 

Tags:    

Similar News