అమరావతిపై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స

Update: 2019-08-24 02:25 GMT

రాజధాని అమరావతిపై వివాదం చెలరేగడంతో మంత్రి బొత్స వివరణ ఇచ్చారు. రాజధానిపై తన వ్యాఖ్యల్ని వక్రీకరించారని మండిపడ్డారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్‌ వ్యాపారిలా మాట్లాడుతున్నారని మండిపడ్డ బొత్స అన్ని ప్రాంతాలూ అభివృద్ధి జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు.

నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై వివాదం చెలరేగడంతో మంత్రి బొత్స క్లారిటీ ఇచ్చారు. రాజధానిపై తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. అమరావతి విషయంలో శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్‌ను అప్పటి చంద్రబాబు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని మాత్రమే తాను చెప్పానని బొత్స వివరణ ఇచ్చారు. అలాగే, అమరావతిలో వరదల గురించే తాను మాట్లాడానన్న బొత్స రాజధాని విషయంలో శివరామకృష్ణ నివేదికను కాకుండా, నారాయణ రిపోర్టునే చంద్రబాబు అమలు చేశారని బొత్స మరోసారి సెటైర్లు వేశారు.

చంద్రబాబు రియల్ ఎస్టేట్‌ వ్యాపారిలా మాట్లాడుతున్నారని బొత్స మండిపడ్డారు. అమరావతి చుట్టూ టీడీపీ నేతల రియల్ ఎస్టేట్ వ్యాపారాలు ఉన్నందునే వాళ్లంతా భయపడుతున్నారని అన్నారు. అయితే తాము అమరావతికి వ్యతిరేకం కాదని, కానీ రాజధాని పేరుతో జరిగిన అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమని బొత్స అన్నారు. ఏదిఏమైనా ఒక్క ప్రాంతం మాత్రమే కాకుండా, అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నదే తమ లక్ష్యమన్నారు.

Full View 

Tags:    

Similar News