వాన్‌పిక్‌ కేసులో వైఎస్‌ జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌కు భారీ ఊరట

Update: 2019-07-30 15:56 GMT

వాన్‌పిక్‌ కేసులో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి‌, నిమ్మగడ్డ ప్రసాద్‌కు భారీ ఊరట లభించింది. వైఎస్‌ జగన్‌, నిమ్మగడ్డ ప్రసాద్‌ ఆస్తుల జప్తును రద్దు చేసిన ఈడీ ట్రిబ్యునల్‌ జప్తు చేసిన ఆస్తుల విడుదలకు ఆదేశాలిచ్చింది. 538కోట్ల విలువైన జగన్ ఆస్తుల రిలీజ్‌కు ఈడీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. జగన్‌కి సంబంధించి ఇడుపులపాయలో 42 ఎకరాలు, పులివెందులలో 16 ఎకరాలు, బంజారాహిల్స్‌, సాగర్ సొసైటీల్లో ప్లాట్లు, యంత్రాల జప్తును ఈడీ ట్రిబ్యునల్‌ రద్దు చేసింది. అలాగే నిమ్మగడ్డకి చెందిన 325కోట్ల ఆస్తుల జప్తు రద్దుచేసిన ఈడీ కోర్టు 274కోట్ల బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని నిమ్మగడ్డను ఆదేశించింది.

ఇక భారతి సిమెంట్స్ కేసులోనూ వైఎస్‌ జగన్‌, భారతికి ఊరట లభించింది. భారతి సిమెంట్స్ కేసులో దర్యాప్తు సరిగా చేయలేదని, నిబంధనలు పాటించలేదని ఈడీ బృందానికి చీవాట్లు పెట్టిన ఈడీ కోర్టు అటాచ్ చేసిన ఆస్తులను విడుదల చేయాలని ఆదేశించింది. భారతి జీతాన్ని కూడా అటాచ్‌ చేయడాన్ని తీవ్రంగా తప్పుబట్టిన ఈడీ కోర్టు మొత్తం 746కోట్ల విలువైన జగన్‌ ఆస్తుల రిలీజ్‌కు ఆదేశించింది.

Tags:    

Similar News