ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తారా?.. జగన్‌పై నెటిజన్ల ప్రశంసలు..

ఆయన రాష్ట్రానికే ముఖ్యమంత్రి. ఆయన చుట్టూ ఐపీఎస్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఒక అడర్ వేస్తే చాలు ఏ పనైనా అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా ఏ మాత్రం దర్పం ప్రదర్శించని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Update: 2019-08-16 02:27 GMT

ఆయన రాష్ట్రానికే ముఖ్యమంత్రి. ఆయన చుట్టూ ఐపీఎస్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఒక అడర్ వేస్తే చాలు ఏ పనైనా అమలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయినా ఏ మాత్రం దర్పం ప్రదర్శించని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎందుకంటే ఆయన చేసిన చిన్నపనికి నెటిజన్లు ఫీదా అయిపోయారు. ఇక అసలు విషయానికి వెళితే గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన 73వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులకు విశిష్ట సేవా పతకాలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందచేశారు. ఈ సందర్బంగా ఓ పోలీస్‌ అధికారికి పతకాన్ని అలంకరించారు.

ముఖ్యమంత్రికి సెల్యూట్‌ చేసే సమయంలో ఆ పతకం పోలీస్‌ అధికారి నుంచి జారి కింద పడింది. అయితే దీనిని గమనించకుండా ఆ పోలీసు అధికారి కవాతు చేస్తూ ముందుకు సాగిపోయారు. అయితే ఈ విషయాన్ని గుర్తించిన సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జారిపడిన ఆ పతకాన్ని కిందకు వంగితీసి సమీపంలో ఉన్న మరో అధికారి చేతికి ఇచ్చారు. ఇప్పుడు ఈ వీడియో క్లిప్పింగ్‌ వైరల్‌ కావడంతో ఏపీ సీఎం వ్యవహరించిన తీరుపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జయహో జగన్ అన్నా.. నీ సాదాసీదా మనసు మరోసారి బయటపడింది, డైనమిక్ లీడర్ అంటూ నెటిన్లు సంబురపడిపోతున్నారు. మరోకరు ఇలా ఏ ముఖ్యమంత్రి అయినా చేస్తాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి సోషల్ మీడియాలో ఈ పోటో తెగ వైరల్ కావడంతో పాటు మరోసారి సింప్లిసిటీ సీఎం అని నెటిజన్లు మనసు దోచుకున్నారు. ఇక మరోవైపు ప్రజా నాయకుడిగా ఎదిగి ముఖ్యమంత్రిగా పలు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్‌ జగన్‌కి మరో గౌరవం దక్కింది. వీడీపీ అసోసియేట్స్‌ నిర్వహించిన సర్వేలో మోస్ట్‌ పాపులర్‌ సీఎంల జాబితాలో ఆయన మూడో స్థానంలో నిలిచారు. దేశవ్యాప్తంగా 71 శాతం మంది సీఎం జగన్‌ పాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నట్లు 'దేశ్‌ కా మూడ్‌' పేరిట చేపట్టిన సర్వేలో తేలినట్లు వీడీపీ అసోసియేట్స్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. 


Tags:    

Similar News