టీడీపీలో టిక్కెట్ కన్ఫామ్.. కానీ వైసీపీలోకి జంప్?

Update: 2019-03-16 03:23 GMT

ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.. ఒక పార్టీలో టిక్కెట్ కన్ఫామ్ చేసినా.. మరొక పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అవుతున్నారు కొందరు నేతలు.. నెల్లూరు జిల్లా టీడీపీ సీనియర్ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డి టీడీపీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఆయనకు రెండు రోజుల కిందటే నెల్లూరు రూరల్ టీడీపీ టిక్కెట్ కన్ఫామ్ అయింది. అయితే ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.

ఇప్పటికే వైసీపీ సీనియర్ నేతలతో మాట్లాడిన ఆదాల ఇవాళ జగన్ ను కలవనున్నట్టు సమాచారం. మరోవైపు ఆయనను ఆపేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఆయన ఎవ్వరికి అందుబాటులోకి రాకుండా ఉన్నట్టు సమాచారం. 

Similar News