కవలలకు జన్మనిచ్చిన మంగాయమ్మ

గుంటూరు కొత్తపేట అహల్య ఆస్పత్రిలో 73 ఏళ్ల మంగాయమ్మ.. కవల పిల్లలకు జన్మనిచ్చింది. మంగాయమ్మకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. కాసేపటి క్రితం సిజేరియన్‌ ద్వారా.. పిల్లలు జన్మించారు.

Update: 2019-09-05 05:53 GMT

గుంటూరు కొత్తపేట అహల్య ఆస్పత్రిలో 73 ఏళ్ల మంగాయమ్మ.. కవల పిల్లలకు జన్మనిచ్చింది. మంగాయమ్మకు ఇద్దరు ఆడపిల్లలే పుట్టారు. కాసేపటి క్రితం సిజేరియన్‌ ద్వారా.. పిల్లలు జన్మించారు. డాక్టర్ శనక్కాయల అరుణ, ఉమా శంకర్ శస్త్రచికిత్స ద్వారా ప్రసవం చేశారు. నవమాసాలు మోసి మరో జన్మలాంటి ప్రసవం అయ్యాక తన బిడ్డలను చూసి ఎంతో మురిసిపోయింది మంగాయమ్మ. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

గతంలో భారతదేశంలో 70 ఏళ్ల మహిళ తల్లైందని డాక్టర్‌ ఉమాశంకర్‌ తెలిపారు. ఆమె పేరు దల్జీందర్‌ కౌర్‌. రాజస్థాన్‌కు చెందిన దల్జీందర్‌, మొహిందర్‌ సింగ్‌ గిల్‌ దంపతులకు కూడా మంగాయమ్మ దంపతుల్లాగానే పెళ్లయి 50 ఏళ్లయినా పిల్లలు పుట్టలేదు. ఆమె కూడా ఐవీఎఫ్‌ విధానాన్ని ఆశ్రయించారు. 2016 ఏప్రిల్‌ 19న ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఆస్పత్రి రికార్డుల ప్రకారం ఆమె వయసు 72 సంవత్సరాలు. అప్పట్లోనే అది ప్రపంచ రికార్డు అన్నారు. ఈ లెక్కన 73 ఏళ్ల వయసులో మంగాయమ్మ ఇద్దరు కవలలను కని ఆ రికార్డు బ్రెక్ చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు మంగాయమ్మ.

Tags:    

Similar News