బ్రేకప్ చెప్పుకోబోతున్న పాకిస్తాన్, డ్రాగన్‌? శ్రీలంక సంక్షోభం పాక్‌లో రిపీట్ కాబోతోందా?

బ్రేకప్ చెప్పుకోబోతున్న పాకిస్తాన్, డ్రాగన్‌?
x

బ్రేకప్ చెప్పుకోబోతున్న పాకిస్తాన్, డ్రాగన్‌?

Highlights

China Pakistan: డ్రాగన్‌ కంట్రీతో దోస్తీ పులిమీద సవారీ... కాదు కాదు గుంటనక్కపై సవారీనే అని మరోసారి తేలిపోయింది.

China Pakistan: డ్రాగన్‌ కంట్రీతో దోస్తీ పులిమీద సవారీ... కాదు కాదు గుంటనక్కపై సవారీనే అని మరోసారి తేలిపోయింది. కాలం కలిసొచ్చినంత వరకూ మా బంధం అద్భుతం, అద్వితీయం అని బిల్డప్ ఇచ్చిన పాక్, చైనాల మధ్య ఇప్పుడు చెడినట్టే కనిపిస్తోంది. పైకి దోస్త్ మేరా దోస్త్ అంటూ పాట పాడుకుంటున్నా.. లోలోపల మాత్రం ఈ రెండు దేశాలు కారాలు, మిరియాలు నూరుకుంటున్నాయి. ఇంతకూ, భారత్‌పై విషం చిమ్మడమే లక్ష్యంగా చెట్టాపట్టాలేసుకున్న పాక్, చైనా మధ్య ఉన్నట్టుండి ఎందుకు చెడింది..? ద్వీపదేశం శ్రీలంకకు పట్టిన గతే పాకిస్తాన్‌కు పట్టబోతోందా..?

డ్రాగన్‌తో దోస్తీ ఎలా ఉంటుందో శ్రీలంకను, పాకిస్తాన్‌ను అడిగితే ఇట్టే తెలిసిపోతుంది. ఇబ్బడి ముబ్బడిగా అప్పులిచ్చి, కోలుకోలేని ఆర్ధిక ఊబిలోకి దించి వెన్నపూసిన కత్తితో నొప్పి తెలియకుండానే వెన్నులో పొడిచేస్తుంది. ఇప్పుడు పాకిస్తాన్‌కు సైతం అలాంటి అనుభవాలే ఎదురవుతున్నాయి. నిన్న మొన్నటి వరకూ భారత్‌పై విషం చిమ్మడమే లక్ష్యంగా విధ్వేష రచనలు చేస్తూ రెచ్చిపోయిన ఈ రెండు దేశాలు ఇప్పుడు ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకునే పరిస్థితికి వచ్చేసినట్టు కనిపిస్తోంది. అయితే, ఇక్కడ నష్టపోయేది మాత్రం ముమ్మాటికీ పాకిస్తానే. ఎవరితో ఫ్రెండ్‌షిప్ చేస్తే ఏం జరుగుతుందో తెలిసి మరీ భారత్‌ను ఎదుర్కొనే సత్తా లేక డ్రాగన్‌తో దోస్తీ కట్టింది. ఇప్పుడా స్నేహమే విషసర్పమై దాయాదిని మింగేయడం ఖాయంగా కనిపిస్తోంది. అసలు, ఈ రెండు దేశాల మధ్యా ఎందుకు చెడింది..? చైనా పౌరుల హత్యలే ఇరు దేశాల రిలేషన్స్‌పై ప్రభావం చూపుతున్నాయా..?

పాకిస్తాన్‌కు డ్రాగన్ సీరియస్ వార్నింగ్.. ఏ ఒక్క పాకిస్తానీ కలలో కూడా ఈ సిట్యువేషన్‌ని ఊహించి ఉండరేమో.! కానీ ఇప్పుడు మాత్రం జరిగింది ఇదే. ఉన్నఫళంగా 30వేల కోట్లు.. అక్షరాలా 30వేల కోట్లు చెల్లించకుంటే సీన్ మారిపోతుందని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. తేడాపాడాలొస్తే పాకిస్తాన్‌లో ఉన్న 30 చైనా కంపెనీలు క్లోస్ చేసేస్తామంది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్‌లో భాగంగా చైనాకు చెందిన 30 కంపెనీలు పాకిస్తాన్‌లో రోడ్లు, రైల్వే, విద్యుత్ కమ్యూనికేషన్ల రంగంలో సేవలందిస్తున్నాయి. ఈ సంస్థలకు పాకిస్తాన్‌ 30వేల కోట్లు బకాయిపడింది. ఈ మొత్తం చెల్లించకుంటే కంపెనీలను తక్షణమే మూసేస్తామంది డ్రాగన్.. దీనికి కౌంటర్‌గా పాకిస్తాన్ నెల రోజుల్లో క్లియర్ చేసేస్తామనైతే ప్రకటనైతే చేసింది. కానీ, ఇది ఇక్కడితో ఆగిపోతుందా..? అన్నది మాత్రం ప్రస్తుతానికి మిలియన్ డాలర్ల ప్రశ్నే.

నిజానికి.. పాక్‌, చైనా బంధానికి బీటలువారింది ఇమ్రాన్ సర్కార్ దిగిపోయిన తర్వాతే. షెహబాజ్ ప్రభుత్వం అధికారం చేపట్టీ చేపట్టగానే డ్రాగన్‌కు ఊహించని ఝలక్ ఇచ్చింది. పాక్-చైనా ఎకనమిక్ కారిడార్ అథారిటీ రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాలోని షిన్ జియాంగ్ ప్రావిన్స్ నుంచి పాక్‌లోని బలూచిస్తాన్ పరిధిలో ఉన్న గదర్ పోర్ట్ మధ్య మైలిక వసతులు, ఇంధన ప్రాజెక్టు ఏర్పాటు కోసం 2019లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దాదాపు 4.5 లక్షల కోట్ల మేర ప్రాజెక్టులను ఉద్దేశించి అథారిటీని నియమించారు. అయితే, ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం సగానికి పైగా ఖర్చు చేశామని చైనా సీరియస్‌ అయిందన్న వార్తలొచ్చాయి. సగానికిపైగా ప్రాజెక్టు పనులు పూర్తయిన నేపధ్యంలో షెహబాజ్ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. సరిగ్గా ఇక్కడే ఇరు దేశాల దోస్తీకి బీటలు పడడం మొదలైందన్నది విశ్లేషకులు చెబుతున్న మాట.

ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతింటున్నాయన్న ఇలాంటి సమయంలోనే కరాచీ వేదికగా ముగ్గురు చైనీయుల హత్యోదంతం మరిన్ని ఉద్రిక్తతలకు దారితీసింది. ఏప్రిల్ 26న కరాచీ యూనివర్సిటీలోని కన్‌ఫ్యూజియస్ సెంటర్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో ముగ్గురు చైనా టీచర్లు మరణించారు. కన్‌ఫ్యూజియస్ సెంటర్‌కు టీచర్లను తీసుకెళ్తున్న బస్సుపై మిలిటెంట్లు దాడి చేశారు. ఈ సెంటర్‌కు ఇటీవల డైరెక్టర్ నియమితులైన అధికారితోపాటు మరో ఇద్దరు టీచర్లు, ఒక పాకిస్తానీ డ్రైవర్ ఈ దాడిలో మరణించారు. షారీ బలూచ్ అలియాస్ బర్మాస్ ఈ దాడిని చేపట్టినట్లు బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. ఈ సంస్థపై వేర్పాటువాద మిలిటెంట్ సంస్థగా పాకిస్తాన్ ముద్ర వేసింది. ఐతే, డ్రాగన్ మాత్రం తమ పౌరుల మృతిపై సీరియస్‌గా ఉంది. పాకిస్తాన్‌ సర్కార్‌ భద్రతా వైఫల్యంతోనే ఇదంతా జరిగిందని గుర్రుగా ఉంది. ఒక్కమాటలో ఇప్పటి వరకు భారత్‌లో జరిగిన ఉగ్రదాడులను చోద్యం చూసిన డ్రాగన్‌కు పాక్ ఉగ్ర కుట్ర నొప్పెలా ఉంటుందో తెలిసొచ్చినట్టయింది.

సరిగ్గా ఇలాంటి వ్యతిరేకతలతోనే పాక్‌కు తమ కుట్ర దెబ్బ ఎలా ఉంటుందో చూపించే ప్రయత్నాలు మొదలు పెట్టింది డ్రాగన్ కంట్రీ. పాకిస్తాన్‌కు విద్యుత్ అందించే చైనా కంపెనీలు ఉత్పత్తిని నిలిపివేశాయి. పాత బకాయిలు చెల్లించకపోవడమే కారణమని చైనా చెబుతోంది. పరిస్థితి చూస్తుంటు ఇది ఇక్కడితో ఆగిపోయేలా కనిపించడంలేదు. పాకిస్తాన్ ఒక్క విద్యుత్‌ అంశంలోనే కాదు మనిషి బ్రతకడానికి కనీస అవసరమైన ప్రతి అంశంలోనూ ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ డ్రాగన్ మీదే ఆధారపడింది. దీంతో రానున్న రోజుల్లో మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు ఒక్కమాటలో ప్రస్తుతం శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్ధిక, ఆహార, రాజకీయ సంక్షోభం పాకిస్తాన్‌ చవిచూడక తప్పదన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఇప్పటికే దాయాది దేశం తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కోవడమే.

ఇప్పటికే పాకిస్తాన్ ఆర్ధిక లోటు ఆందోళన కరంగా మారింది. దాయాది ప్రస్తుత ఆర్ధిక లోటు 13.2 బిలియన్ డాలర్లకు పెరిగింది. దీంతో రానున్న రోజులన్నీ షెహబాజ్ సర్కార్‌కు విషమపరీక్షలే అన్నట్టుగా పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో పాక్ మెడపై డ్రాగన్ రికవరీ కత్తిపెట్టడం చూస్తుంటే.. ఆ దేశాన్ని మరో శ్రీలంకను చేసే వరకు నిద్దురపోయేలా కనిపించడం లేదు. ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపధ్యంలో చిన్న దేశాలకు అప్పులు పుట్టడమే గగనమైపోయిన ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోకుండా గట్టెక్కితుందా అన్నదీ మిలియన్ డాలర్ల ప్రశ్నే. ఒక్కమాటలో చిన్న దేశాల పాలిట యమపాశంగా డ్రాగన్ కంట్రీ మారుతోంది. ఇప్పటికైనా జిన్‌పింగ్ జిత్తుల్లో చిక్కుకోకుండా ఉంటేనే చిన్న దేశాల మనుగడ ఉంటుందంటున్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories