Metpally: పిచ్చికుక్కల బీభత్సం.. యమపాశాల్లా మారిన వీధి కుక్కలు

Metpally: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలోని వాసవి గార్డెన్ సమీపంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 April 2026 3:35 PM IST
Metpally
X

Metpally: పిచ్చికుక్కల బీభత్సం.. యమపాశాల్లా మారిన వీధి కుక్కలు

మెట్టుపల్లి: జగిత్యాల జిల్లా మెట్టుపల్లి పట్టణంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాసవి గార్డెన్ సమీపంలో కుక్కల దాడితో స్థానిక ప్రజలు ప్రాణభయంతో వణికిపోతున్నారు. ఉదయం నుండి వరుసగా 8 మందిపై దాడి చేసిన కుక్కలు, ఒకే కుటుంబానికి చెందిన పరువురిని గాయపరచడం ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

​మెట్టుపల్లిలోని వాసవి గార్డెన్ పరిసర ప్రాంతాల్లో వీధి కుక్కలు యమపాశాల్లా మారాయి. ఉదయం ఆడుకుంటున్న ఓ బాలుడిపై దాడి చేసిన కుక్కలు.. మధ్యాహ్నం సమయంలో అదే బాధితుడి తాతపై కూడా దాడి చేశాయి. విచారకరమైన విషయం ఏంటంటే.. ఆ బాలుడినిని గత నెల రోజుల్లో కుక్కలు కరవడం ఇది రెండోసారి. అక్కడితో ఆగకుండా, ఇప్పుడు మరో చిన్నారిని, అతని కుటుంబీకులను కూడా కుక్కలు వేటాడి కరిచాయి.

ఉదయం నుండి అదే ప్రాంతంలో 8 మంది పై కుక్కలు దాడి చేశాయి. ​వరుస ఘటనలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదంటూ వార్డు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి స్పందించారు. అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి, వెంటనే కుక్కలను బంధించి ఊరి బయట వదిలేయాలని ఆదేశించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story