Kulkacharla: ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం
Kulkacharla: వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలం బండవెలికిచర్ల శివారులోని పాంబండ రామలింగేశ్వర దేవస్థానంలో పౌర్ణమి సందర్భంగా గిరిప్రదక్షిణ కార్యక్రమం జరిగింది.
Kulkacharla: ప్రకృతి ఒడిలో కొలువై ఉన్న పవిత్ర క్షేత్రం
Kulkacharla: కుల్కచర్ల మండలం బండవెలికిచర్ల గ్రామ శివారులోని శ్రీ రామలింగేశ్వర దేవస్థానం. ప్రతి పౌర్ణమికి ఇక్కడ జరిగే గిరిప్రదక్షిణ ఒక ప్రత్యేక ఉత్సవం. తాజాగా బుధవారం నాడు పాంబండ గిరిప్రదక్షిణ కార్యక్రమం అత్యంత శోభాయమానంగా, భక్తజన సందోహం మధ్య వైభవంగా నిర్వహించబడింది. పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని చుట్టుపక్కల గ్రామాల నుండే కాకుండా, సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
శివనామా స్మరణతో మారుమోగుతున్న వేళ, భక్తులందరూ కలిసి పాంబండ చుట్టూ పాదయాత్రగా నడుస్తూ గిరిప్రదక్షిణను పూర్తి చేశారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ప్రకృతి సిద్ధమైన కొండపై వెలసిన రామలింగేశ్వరుని దర్శించుకుని భక్తులు పులకించిపోయారు.
నియమ నిష్టలతో సాగిన ఈ గిరిప్రదక్షిణలో చిన్న, పెద్ద, మహిళలు అని తేడా లేకుండా అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండ చుట్టూ సాగే ఈ పాదయాత్ర కేవలం భక్తి మార్గమే కాకుండా, మానసిక ప్రశాంతతకు చిరునామాగా నిలిచింది. భక్తుల రాకతో పాంబండ క్షేత్రం ఆధ్యాత్మిక కాంతులతో వెలిగిపోయింది.




