Pargi: సబ్ జైలులో ఉచిత వైద్య శిబిరం.. ఖైదీలకు దంత పరీక్షలు

Pargi: తెలంగాణ ప్రభుత్వ 'ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక'లో భాగంగా పరిగి సబ్ జైలులో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు.

WAZID, PARIGI
Published on: 1 April 2026 4:34 PM IST
Pargi
X

Pargi: సబ్ జైలులో ఉచిత వైద్య శిబిరం.. ఖైదీలకు దంత పరీక్షలు

PARGI: తెలంగాణ ప్రభుత్వ 99 రోజుల ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా బుధవారం పరిగి సబ్ జైలులో జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీ సాయి డెంటల్ హాస్పిటల్, కాలేజ్, వికారాబాద్ సహకారంతో జైలు లోని ముద్దాయిలకు, సిబ్బందికి మెడికల్ క్యాంపు నిర్వహించారు.

ఇట్టి క్యాంపులో ముద్దాయిలందరికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణి చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జైలు సూపరింటెండెంట్ రాజ్ కుమార్ మాట్లాడుతూ ఖైదీల ఆరోగ్య పరిరక్షణ ప్రాథమిక కర్తవ్యమని ఇట్టి కార్యక్రమానికి ప్రైవేటు హాస్పిటల్స్ సహకరించి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మరియు ఉచితంగా పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు.

ఈ కార్యక్రమంలో శ్రీ సాయి డెంటల్ హాస్పిటల్ పిఆర్ఓ రవీందర్ గౌడ్, వైద్యులు వివేక్, శిశ్య ప్రియ, కేజియా, గాయత్రీ దేవి, జైలు హెడ్ వార్డర్ జి. బి. విశ్వనాథ రావు, వార్డర్స్ శ్రీను, హరికృష్ణ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

WAZID, PARIGI

WAZID, PARIGI

Next Story