Bodhan: వరి కోతలు షురూ.. కొనుగోలు కేంద్రాల జాడ ఏది?

Bodhan: నిజామాబాద్ జిల్లా బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట అఖిలభారత ఐక్య రైతు సంఘం ధర్నా నిర్వహించింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 1 April 2026 4:18 PM IST
Bodhan
X

Bodhan: వరి కోతలు షురూ.. కొనుగోలు కేంద్రాల జాడ ఏది?

Bodhan: రాష్ట్ర ప్రభుత్వం దళారీ వ్యవస్థను అరికట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని అఖిలభారత ఐక్యరైతు సంఘం ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా ఆరుగాలం పండించిన రైతులకు అటు ప్రకృతి తో పాటు దళారులతో ఇబ్బందులు తప్పడం లేదని రాష్ట్ర నాయకులు గుమ్ముల గంగాధర్ ఆరోపించారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం మూలంగా రైతుల పంటలను దళారులు తక్కువ ధరకు దోచుకెళ్తున్నారని ఏ ఒక్క దళారికి లైసెన్సులు కూడా లేవని దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడడంతో పాటు దళారి వ్యవస్థతో రైతులకు నష్టం జరుగుతుందని మండిపడ్డారు. బోధన్ డివిజన్లో వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ఇంతవరకు కొనుగోలు కేంద్రాల జాడ లేకపోవడంతో క్వింటా ధాన్యానికిరూ. 1850 ధరచెల్లించి తేమ పేరుతో 5 కిలోల తరుగును తీస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు.

డివిజన్ పరిధిలోని రుద్దురు మండల కేంద్రంలో ఓ దళారి రైతుల నడ్డి విరుస్తూ అందని కాడికి దండుకుంటున్నాడని అలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వివరించడం సరికాదన్నారు. దళారి వ్యవస్థతో గత ఏడాది సుమారు 250 మంది రైతులు రూపాయలు ఐదు కోట్లు నష్టపోయారని దీనిని గమనించి ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

తింటాధాన్యానికి 3వేల చొప్పున ధర చెల్లించి రైతులకు బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి సబ్ కలెక్టర్ వికాస్ మహాతోకు వినతి పత్రం అందజేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రాజేశ్వర్, నాగన్న, బోధన్ మండల కార్యదర్శి సుల్తాన్ సాయిలు, కాశ రవి, పోశెట్టి ఏ ఏ కె ఎమ్ ఎస్ నాయకులు ఉన్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story