Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాక్.. మ్యాచ్ గెలిచిన ఆనందమే లేకుండా పోయింది!
Shreyas Iyer: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలోనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా అతడికి ఐపీఎల్ కమిటీ రూ.12 లక్షల జరిమానా విధించింది.
Shreyas Iyer
Shreyas Iyer: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలోనే పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు భారీ షాక్ తగిలింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ నమోదు చేసిన కారణంగా అతడికి ఐపీఎల్ కమిటీ రూ.12 లక్షల జరిమానా విధించింది. దాంతో ఈ సీజన్‌లో జరిమానా ఎదుర్కొన్న తొలి కెప్టెన్‌గా శ్రేయస్ నిలిచాడు. టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ముందుగా బౌలింగ్ చేసింది. నిర్ణీత సమయంలోగా ఓవర్లను పంజాబ్ పూర్తి చేయలేకపోయింది. స్లో ఓవర్ రేట్ కారణంతో శ్రేయస్‌కు ఫైన్ విధిస్తూ ఐపీఎల్ పాలక మండలి ప్రకటించింది. ఇదే రెండోసారి రిపీట్ అయితే శ్రేయస్‌తో పాటు ఆటగాళ్లకు ఫైన్ పడుతుంది. మూడోసారి కూడా ఇదే జరిగితే.. ఫైన్ సహా శ్రేయస్‌పై ఓ మ్యాచ్ నిషేధం పడుతుంది.
న్యూ చండీగఢ్‌లో మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ మూడు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్‌పై విజయం సాధించింది. అయితే పంజాబ్ విజయం సాధించినప్పటికీ.. ఓవర్ రేట్ నిబంధనలు పాటించకపోవడంతో శ్రేయాస్ అయ్యర్‌పై చర్యలు తీసుకున్నారు. ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌లోని ఆర్టికల్ 2.22 ప్రకారం ఇది మొదటి తప్పిదం కావడంతో రూ.12 లక్షల ఫైన్ విధించారు. గత సీజన్‌లో కూడా శ్రేయాస్ ఇలాంటి తప్పిదం చేసిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ విషయానికి వస్తే.. గుజరాత్ టైటాన్స్‌ను 162 పరుగులకే కట్టడి చేసిన పంజాబ్ ఛేదనలో మంచి ఆరంభం అందుకుంది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్ సింగ్‌తో కలిసి యువ ఆటగాడు కూపర్ కనోలీ రెండో వికెట్‌కు 77 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే ఒక దశలో 110/2 నుంచి 118/6గా నిలవడడంతో పంజాబ్ ఓటమి అంచుల వరకూ వెళ్లింది. అయితే కనోలీ అద్భుతంగా ఆడుతూ 44 బంతుల్లో 72 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. ఇన్నింగ్స్ చివరలో జేవియర్ బార్ట్‌లెట్, మార్కో యాన్సన్‌లతో కలిసి కనోలీ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి మ్యాచ్‌ను పంజాబ్ వైపు తిప్పాడు. అతడికి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు లభించింది.
మ్యాచ్ అనంతరం శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ... 'ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లోనే అద్భుత విజయం సాధించడం చాలా సంతోషంగా ఉంది. కూపర్ కనోలీ ఆటను దగ్గరగా చూడటం బాగుంది. అద్భుతమైన షాట్లు కొట్టాడు. కొద్దీ వ్యవధిలోనే వికెట్లు పడినా.. కనోలీ మాత్రం చివరివరకూ క్రీజ్‌లో నిలబడడం అభినందనీయం. త్వరత్వరగా వికెట్లు పడడంతో కాస్త టెన్షన్ ఫీల్ అయ్యాం. నేను అవుట్ అయ్యాక నా చేతి గురించి ఆలోచిస్తూ ఉండిపోయా. దానికి ఐస్ పెడుతుండగానే రెండు వికెట్లు పడ్డాయి. ఐపీఎల్‌లో ఇలాంటి పరిస్థితులు మాములే. కూపర్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. అతడికే ఏ విజయం క్రెడిట్ ఇవ్వాలి. వైశాఖ్ లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశాడు. ప్రత్యర్థిని కట్టడి చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఇదే జోష్‌తో మిగతా మ్యాచుల్లోనూ ఆడతాం' అని చెప్పాడు.




