CM KCR: మ‌త పిచ్చిగాళ్ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ తరిమికొట్టాలి..

CM KCR: కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు CM కేసీఆర్.

Arun Chilukuri
Published on: 25 Aug 2022 5:54 PM IST
Should Revolt Against Religious Politics Says CM KCR
X

CM KCR: మ‌త పిచ్చిగాళ్ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ తరిమికొట్టాలి..

CM KCR: కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదని విమర్శించారు CM కేసీఆర్. దళితులకు, గిరిజనులకు, మహిళలకు, బలహీన వర్గాల కోసం కేంద్రంలోని మోడీ సర్కారు ఏమైనా చేసిందా? అని ప్రశ్నించారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో దేశంలో ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదని మండిపడ్డారు. ప్రధాని మోడీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు.

తెలంగాణ ప్రశాంత వాతావరణంలో పురోభివృద్ధి దిశగా పయనిస్తుంటే, మతపిచ్చిగాళ్లు దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి స్వార్థపరులైన మతపిచ్చిగాళ్లను తెలంగాణ నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఒక్కసారి దెబ్బతింటే వందేళ్లు నష్టపోతామని అన్నారు. బంగారు పంటలు పండే తెలంగాణ రాష్ట్రం కావాలో, మతపిచ్చితో భగ్గుమనే తెలంగాణ రాష్ట్రం కావాలో ప్రజలే తేల్చుకోవాలని పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story