జనవరి 19న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

లటుపల్లి ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య,అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

S. Srikanth
Published on: 23 Dec 2019 1:56 PM IST
జనవరి 19న జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
X
వైద్యాధికారి డాక్టర్ డి.వసంతలీల

బిజినపల్లి: లటుపల్లి ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య,అంగన్వాడీ, ఆశా కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనవరి 19న జరిగే ప్రత్యేక పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రజలు వినియోగించుకుని విజయవంతం చేయాలని లట్టుపల్లీ వైద్యాధికారి డాక్టర్ డి.వసంతలీల అన్నారు.

ఆమె మాట్లాడుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నాగర్ కర్నూలు జిల్లాలో జనవరి19, 20, 21తేదీలలో ప్రత్యేకంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజలు వినియోగించుకొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమానికి ప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారం తప్పనిసరిగా కోరాలని అని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య పర్యవేక్షకులు కిష్టమ్మ, ఆరోగ్య కార్యకర్తలు యాదగిరి, నాగేష్, పద్మ గంగ, బుజ్జమ్మ, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

S. Srikanth

S. Srikanth

Next Story