Babu Mohan: బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. ఇకపై పార్టీలో కొనసాగుతానో లేదో తెలియదు..

Babu Mohan: బీజేపీ నేత బాబూమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Arun Chilukuri
Updated on: 28 Oct 2023 4:01 PM IST
Not Contesting in This Assembly Elections Says Babu Mohan
X

Babu Mohan: బాబు మోహన్ సంచలన వ్యాఖ్యలు.. ఇకపై పార్టీలో కొనసాగుతానో లేదో తెలియదు..

Babu Mohan: బీజేపీ నేత బాబూమోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయటం లేదని.. అన్ని ప్రచారాలకు, అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉంటానని బాబుమోహన్ ప్రకటించారు. పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. మొదటిలిస్ట్ లో తన పేరు లేకపోవడంతో.. బాబూమోహన్ కు మొండిచేయి అంటూ సోషల్ మీడియాలో ప్రచారాలు జరగడం తనను బాధించాయన్నారు.

తనకు తన కొడుక్కి మధ్య టికెట్ పంచాయితీ నడుస్తుందని సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయన్నారు. దీనికి తోడు బీజేపీ అధ్యక్షుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా.. స్పందన లేదని.. మనస్తాపానికి గురైనట్టు ప్రకటించారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లోమాట్లాడిన ఆయన ఇకపై పార్టీలో ఉంటానో.. ఉండనో.. అది అధిష్టానం స్పందనను బట్టి ఉంటుందని బాబూ మోహన్ స్పష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story