Mahabubabad: పిల్లల్ని బావిలో తోసి.. గృహిణి ఆత్మహత్య

Mahabubabad: గృహిణితో పాటు కుమార్తె మృతి

Jyothi
Published on: 23 March 2024 12:36 PM IST
Mother Commits suicide by throwing two children into a well
X

Mahabubabad: పిల్లల్ని బావిలో తోసి..గృహిణి ఆత్మహత్య

Mahabubabad: క్షణికావేశంలో ఇద్దరు పిల్లలను బావిలో తోసేంసిందో గృహిణి. అనంతరం తాను బావిలోకి దూకింది. ఘటనలో తల్లి, కుమార్తె మృతి చెందగా.. కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం శ్రీరామ శివారు వెంకటాపురంలో ఘటన చోటు చేసుకుంది.

గ్రామానికి చెందిన ఆకుల మురళికి, సిద్దిపేట జిల్లాకు చెందిన లావణ్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు ముఖేష్ కుమార్తె నిత్యశ్రీ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ దంపతుల మధ్య తరచూ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నానని లావణ్య అనుమానిస్తూ ఉండడమే ఇందుకు కారణంగా సమాచారం. ఈ సందర్భంగా భర్తతో ఘర్షణ పడి క్షణికావేశంలో గ్రామంలోని మంచినీటి భావి వద్దకు గృహిణి తన పిల్లలతో కలిసి వెళ్ళింది.

కుమారుడు, కుమార్తెను మంచి నీటి బావిలోకి నెట్టి.. తాను దూకింది. బాలుడు పైపుని పట్టుకొని బయటకు వచ్చి కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తల్లి కూమార్తెను బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందారు. విషయం తెలుసుకున్న నెల్లికుదురు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

Jyothi

Jyothi

Next Story