ఇంటింటికి బీజేపీ ప్రచారంలో పాల్గొన్న నియోజకవర్గ ఇంఛార్జి రఘునాధ్

ఇంటింటికి బీజేపీ ప్రచారంలో పాల్గొన్న నియోజకవర్గ ఇంఛార్జి రఘునాధ్
x
రఘునాధ్
Highlights

జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్కె6 లో గుడిసెలల్లో గడప గడపకు బీజేపీ ప్రచారం కార్యక్రమం నిర్వహించారు.

మంచిర్యాల: జిల్లాలోని నస్పూర్ మున్సిపల్ పరిధిలోని ఆర్కె6 లో గుడిసెలల్లో గడప గడపకు బీజేపీ ప్రచారం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు వార్డు తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రఘునాథ్ మాట్లాడుతూ.... రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించినట్లయితే కోల్ బెల్ట్ ప్రాంతాల్లో ఉన్న ఇళ్ల పట్టాల సమస్య శాశ్వతంగా పరిష్కరిస్తామని, మున్సిపల్ పరిధిలో చాలా సమస్యలు ఉన్నాయని, మంచి నీరు రాక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, డ్రైనేజీలు వ్యవస్థ సరిగా లేదని, ప్రజలు దోమల వల్ల విషజ్వరాల పాల్పడుతున్నారని అన్నారు.

ఇక్కడున్న పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రి కి వెళ్ళలేక, ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్య సదుపాయాలు లేక, తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. ఇప్పటికైనా ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ స్పందించి మంచిర్యాలలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నస్పుర్ పట్టణ అధ్యక్షులు అగాల్ డ్యూటీ రాజు, మిట్టపల్లి మొగిలి, సత్రం రమేష్, కొండ వెంకటేష్, రావనవేని శ్రీనివాస్, ఎండీ పాషా, తడూరి మహేష్, భోగే మధు, మహిళలు మరియు తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories