తెలంగాణాలో ఒక్కరోజే 199 కరోనా కేసులు!

K V D Varma
Published on: 31 May 2020 10:10 PM IST
తెలంగాణాలో ఒక్కరోజే 199 కరోనా కేసులు!
X
Representational Image

ఆదివారం ఒక్కరోజులో తెలంగాణాలో రికార్డు స్థాయిలో భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 199 కరోనా కేసులు వెలుగుచూసినట్టు హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. వీటిలో 196 కరోనా కేసులు రాష్ట్రానికి చెందినవి. మరో 3 కరోనా కేసులు వలసకార్మికులకు చెందినవి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,698కు చేరుకుంది. అయితే, లోకల్ కేసులు మాత్రం 2264 అని హెల్త్ బులెటిన్‌లో వివరించారు. ఆదివారం మరో ఐదుగురు కరోనాతో చనిపోయినట్లుగా పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకూ కరోనా మృతుల సంఖ్య 82కు చేరుకుంది.

K V D Varma

K V D Varma

Next Story