గ్రామీణ నిరుద్యోగ యువత కు ఉచిత శిక్షణ

గ్రామీణ నిరుద్యోగ యువత కు ఉచిత శిక్షణ
x
Highlights

గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (SBI RSETI)ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎస్.ఎల్.ప్రేమ్ సాగర్ తెలిపారు.

ఖమ్మం: గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (SBI RSETI)ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఎలక్ట్రికల్ మోటార్ రీవైన్డింగ్ అండ్ సర్వీసింగ్ లో 23/12/19 నుండి ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు సంస్థ డైరెక్టర్ ఎస్.ఎల్.ప్రేమ్ సాగర్ తెలిపారు. వీటితో పాటుగా రెఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ మరియు టూ వీలర్ మెకానిక్ లో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలలోని గ్రామీణ నిరుద్యోగ యువత మాత్రమే అర్హులు అని చెప్పారు.

ఉచిత శిక్షణ తో పాటు ఉచిత వసతి కూడా కల్పించడం జరుగును. 19 నుండి 45 సంవత్సరాల మధ్య వయస్సు లోపు ఉండి, తెలుగులో చదవడం మరియు రాయడం వచ్చి ఉండాలి. ఆసక్తి కలిగిన యువత ఆధార్, రేషన్ మరియు చదువుకు సంబందించిన జిరాక్స్ లు తీసుకొని వచ్చి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వివరాలకు :08742 -295972, 9502801093, 9642589084, 9885062799, 8125394333. అడ్రెస్ తరుని హాట్ వరంగల్ క్రాస్ రోడ్ ఖమ్మం.

Show Full Article
Print Article
Next Story
More Stories