సేవ జ్యోతి శరణాలయంలో మాజీ ప్రధాన మంత్రి జయంతి వేడుకలు

మండలంలోని బోయపల్లిబోర్డు వేణునగర్ వద్దగల సేవా జ్యోతి శరణాలయంలో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్, మధన్ మోహన్ మాలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

S. Srikanth
Published on: 25 Dec 2019 12:38 PM IST
సేవ జ్యోతి శరణాలయంలో మాజీ ప్రధాన మంత్రి జయంతి వేడుకలు
X
గజ్జెల్లి మల్లేశం, గౌరక్క కాంత, సర్వమాధవజిత్, రాజయ్య, రాజ్ కుమార్, కృష్ణ, విద్యార్థులు

తాండూరు: మండలంలోని బోయపల్లిబోర్డు వేణునగర్ వద్దగల సేవా జ్యోతి శరణాలయంలో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పాయ్, మధన్ మోహన్ మాలవ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం సేవా జ్యోతి శరణాలయం వ్యవస్థాపక అధ్యక్షురాలు గజ్జెల్లి శ్రీదేవి మల్లేశం సగర మాట్లాడుతూ... ప్రతి తల్లి తండ్రి ఇలాంటి నాయకుల గురించి వివరంగా మన పిల్లలకు చెప్పాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పారు.

సత్యకేశవజిత్ సేవా జ్యోతి విద్యార్థి సేవా ప్రముఖ్ మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులుగా ఎదుగుతారు, మనం మన వసుధైక కుటుంబం సేవా ప్రస్థానం, భారతీయతను కాపాడుకోవాల్సిన బాధ్యత, మనందరి పై ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా జ్యోతి సేవా ప్రముఖ్ గజ్జెల్లి మల్లేశం, శరణాలయ నిర్వాహకులు కొంకటి స్వప్న, గౌరక్క కాంత, సర్వమాధవజిత్, రాజయ్య, రాజ్ కుమార్, కృష్ణ, విద్యార్థులు, మానసిక వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.



S. Srikanth

S. Srikanth

Next Story