Breaking News: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్

Breaking News: తెలంగాణ సీఎం కేసీఆర్ కోవిడ్ బారిన పడ్డారు.

Arun Chilukuri
Updated on: 20 April 2021 6:52 AM IST
Breaking News: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్
X

Breaking News: తెలంగాణ సీఎం కేసీఆర్ కోవిడ్ బారిన పడ్డారు. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు ఉండడంతో యాంటిజెన్ పరీక్షలు చేసిన వైద్యులు పాజిటివ్‌గా తేలింది. దాంతో ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యుల బృందం చెప్పడంతో ఫాం హౌస్‌లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షిస్తుంది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ తెలిపారు. సాగర్ బహిరంగ సభలో పాల్గొన్న తర్వాత నుంచి సీఎం కేసీఆర్ ఐసోలేషన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story