CM KCR: త్వ‌ర‌లోనే గిరిజ‌న బంధు.. భూమి లేని గిరిజనులకు రూ.10లక్షల సాయం..

CM KCR: రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు.

Arun Chilukuri
Published on: 17 Sept 2022 5:17 PM IST
CM KCR Announces Girijana Bandhu
X

CM KCR: త్వ‌ర‌లోనే గిరిజ‌న బంధు.. భూమి లేని గిరిజనులకు రూ.10లక్షల సాయం..

CM KCR: రాష్ట్రంలోని గిరిజనులకు సీఎం కేసీఆర్ శుభ‌వార్త వినిపించారు. దళిత బంధు లాగే గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. భూమి లేని గిరిజనులకు 10లక్షల రూపాయలు సాయం చేస్తామన్నారు. పోడు భూములు పంచిన త‌ర్వాత అస‌లు భూములు లేని గిరిజ‌నుల‌ను తేలుద్దాం. ఆ లెక్క‌ను చూసిన త‌ర్వాత ద‌ళిత‌బంధు మాదిరిగా గిరిజ‌న బంధును కూడా అమ‌లు చేయ‌బోతున్నాం. భూమి, భుక్తి లేకుండా, ఎలాంటి ఆధారం లేని వారికి గిరిజ‌న బంధును త‌న చేతుల మీదుగా ప్రారంభిస్తాను. సాధించుకున్న స్వ‌రాష్ట్రంలో కులం మతం జాతి అనే బేధం లేకుండా జీవించాలి. ఈ దేశానికి మ‌నం వెలుగు దివిటీలం కావాలి. అవినీతి ర‌హితంగా ఈ ప్ర‌భుత్వాన్ని కాపాడుకుంటున్నామ‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story