

ESI: ESI లబ్దిదారులకు బిగ్ అలెర్ట్.! ఇకపై ఆ రెండింటికి సెపరేట్ క్లెయిమ్ అక్కర్లేదు..!
ఇకపై సిక్‌నెస్, మెటర్నిటీ బెనిఫిట్స్ కోసం సపరేట్ క్లెయిమ్స్ అవసరం లేదు. పేపర్ వర్క్ లేకుండా DBT ద్వారా నగదు పొందవచ్చు. ఇందుకు ESIC మెడికల్ సర్టిఫికెట్ జారీ అవడంతో పాటు యజమాని రిటర్న్స్ దాఖలు, ఉద్యోగి ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ అయి ఉండాలి. గాయాలైనప్పుడూ సపరేట్‌గా అప్లై చేయక్కర్లేదు.


Achampet: పత్తి తూకంలో భారీ మాయాజాలం.. ఏకంగా 10 క్వింటాళ్ల తేడా!
నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం బాణాలలో రైతు రాజవర్ధన్ రెడ్డి వద్ద వ్యాపారి శంకరయ్య 41 క్వింటాళ్లుగా తూకం వేసిన పత్తి అచ్చంపేట వేబ్రిడ్జిపై 51 క్వింటాళ్లుగా తేలింది. 10 క్వింటాళ్ల మోసం బయటపడటంతో పోలీసులు డీసీఎం సీజ్ చేసినా, రాజకీయ ఒత్తిడితో కేసు లేకుండానే వదిలేసినట్లు ఆరోపణలు వచ్చాయి.


Chityala: తెలంగాణ భవన్ సమావేశానికి వెళ్తున్న కంచర్ల భూపాల్ రెడ్డి అడ్డగింత!
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి వాహనాన్ని నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసులు నిలిపివేశారు. శాంతిభద్రతల కారణాలతో అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో కంచర్ల వారితో వాగ్వాదానికి దిగి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.


Devarkadra: వరి కొయ్యలను కాల్చి భూసారం తగ్గించుకోవద్దు: ఏవో రాజేందర్ అగర్వాల్!
వరి కోతల అనంతరం వరి కొయ్యలను కాల్చడం వల్ల నేలలోని మిత్ర సూక్ష్మజీవులు నశించి భూసారం తగ్గడంతో పాటు పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని దేవరకద్ర వ్యవసాయ అధికారి రాజేందర్ అగర్వాల్ తెలిపారు. కొయ్యలను రోటవేటర్ ద్వారా భూమిలో కలియదున్ని సేంద్రియ పదార్థాన్ని పెంచాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.


Weather Update: బంగాళాఖాతంలో ద్రోణి ఎఫెక్ట్.. ఏపీకి వర్ష సూచన.. తెలంగాణలో చలి పంజా
బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు.


Mancherial: ముగ్గురికి మూడు హెల్మెట్లు.. మంచిర్యాల ట్రాఫిక్ ఎస్‌ఐ అభినందన!
మంచిర్యాల–బెల్లంపల్లి చౌరస్తాలో స్కూటీపై ప్రయాణిస్తున్న ముగ్గురూ హెల్మెట్లు ధరించి వెళ్లడాన్ని గమనించిన ట్రాఫిక్ ఎస్‌ఐ రాములు వారిని అభినందించారు. హెల్మెట్ అలంకారం కాదని, ప్రాణ రక్షణ కవచమని పేర్కొంటూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇంటికి చేరాలని ఎస్‌ఐ రాములు, ఏఎస్ఐ జగన్ సూచించారు.


Suryapet: ప్రగతి విద్యానిలయంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం!
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రగతి విద్యానిలయంలో 2002 2003 పదో తరగతి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 23 ఏళ్ల తర్వాత కలుసుకున్న స్నేహితులు జ్ఞాపకాలు నెమరువేసుకున్నారు. విశ్రాంత తహసీల్దార్ అరుణా జ్యోతి, హెచ్‌ఎం సుధాకర్ రెడ్డి, నాటి ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.


Local Trains: హైదరాబాద్ ట్రాఫిక్‌కు చెక్ పెట్టే మార్గం ఇదే.. రూ.50లోపే రైలు ప్రయాణం
హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లు మీ ప్రయాణ సమయాన్ని తగ్గించేందుకు ఉపయోగపడవచ్చు.


Motor Insurance: వాహనదారులకు బిగ్ అలర్ట్.. డిసెంబర్ 15 నుండి మారనున్న కారు, బైక్ ఇన్సూరెన్స్ రూల్స్!
కారు లేదా బైక్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు అన్నీ కలిపి ఇంత ప్రీమియం అవుతుంది అని ఏజెంట్లు చెబితే మనం గుడ్డిగా డబ్బులు కట్టేస్తుంటాం. అసలు మనం కట్టే డబ్బులో దేనికి ఎంత రక్షణ లభిస్తుందో, ఏ కవరేజీ మనకు నిజంగా అవసరమో స్పష్టంగా తెలిసేది కాదు. కానీ ఇకపై ఆ అయోమయానికి తెరపడనుంది.


Palnadu Tension: బాలయ్య పీఏ పావులూరి శ్రీనివాసరావు అరెస్ట్.. 65 మందిపైనా కేసులు
నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావును పల్నాడు పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 65 మందిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు.


AR Rahman: ఆ ఒక్క సినిమా కోసం ఏకంగా 10-12 మూవీస్ వదులుకున్నా.. రెహ్మాన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
రామాయణ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డానని సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ అన్నారు. 'ఈ మూవీ కోసం 10 12 సినిమాలు వదులుకున్నా. కేవలం ఇందులో లీనమవ్వడం కోసం పెద్ద ప్రాజెక్టులనూ అంగీకరించలేదు. సినిమాలోని కొన్ని కంపోజిషన్స్ డజనుకుపైగా మార్పులకు గురయ్యాక ఖరారయ్యాయి. రావణ తాండవ్ పాట కోసం 12 13 వెర్షన్లు ప్రయత్నించాం.


Dharmavaram: ధర్మవరం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్‌గా వై. విజయలక్ష్మి ఎంపిక!
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని జనసేన 26వ వార్డు కౌన్సిలర్ వై. విజయలక్ష్మికి కూటమి కేటాయించింది. BSc, MLT చదివిన ఆమె భర్త వై. రాజు సహకారంతో ప్రజాసేవలోకి అడుగుపెట్టారు. కూటమి ప్రభుత్వ మద్దతుతో ధర్మవరాన్ని ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.