శ్రావణంలో ఈ విధంగా శివుడిని పూజించండి.. ఈ ఫలితాలని పొందండి..!

ఎవరైతే సోమవారం శివుడిని ఆరాధిస్తారో వారికి శివానుగ్రహం లభిస్తుందని నమ్ముతారు. అయితే శివపూజ చేసే విధానం గురించి ఈరోజు తెలుసుకుందాం.
శివపూజ చేసేటప్పుడు శరీరం, మనస్సు పవిత్రంగా ఉండాలి.
సోమవారం పూజ పుణ్యాన్ని పొందడానికి రుద్రాష్టకం, శివ మహిమ్న స్తోత్రం, శివ తాండవ స్తోత్రాలను పఠించవచ్చు.
తర్వాత స్వచ్ఛమైన నెయ్యితో దీపం హారతి చేయాలి.