మహిళలకు అలర్ట్.. రాత్రిపూట టాక్సీలో ట్రావెల్‌ చేస్తున్నారా..!

ఇంతకుముందు రాత్రిపూట మగవాళ్లనే డ్యూటీకి పెట్టేవారు కానీ ఈ రోజుల్లో ఆడవాళ్లు కూడా ఆఫీస్‌లోనే లేట్‌ రాత్రుళ్లు పనిచేయాల్సి వస్తోంది.
మీరు వ్యక్తిగత వాహనం లేదా టాక్సీని బుక్ చేసుకోవడం ద్వారా ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది.
క్యాబ్‌లో కూర్చున్న తర్వాత మీ లొకేషన్‌ను కుటుంబంలోని ఒకరు లేదా ఇద్దరు వ్యక్తులకు కచ్చితంగా షేర్‌ చేయాలి.
డ్రైవర్ సరిగ్గా నడపడం లేదని మీతో తప్పుగా ప్రవర్తిస్తున్నాడని మీకు డౌట్ వస్తే వెంటనే మీ స్నేహితుడికి లేదా కుటుంబంలో ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలి.
రాత్రిపూట ప్రయాణిస్తున్నప్పుడు ఫోన్ పూర్తిగా ఛార్జ్ చేయాలి. లేదా ఫోన్ బ్యాటరీ అయిపోకుండా ఉండాలంటే తప్పనిసరిగా పవర్ బ్యాంక్‌ని కలిగి ఉండాలి.
మీరు ట్యాక్సీని బుక్ చేసినప్పుడల్లా వాహనం నంబర్‌ను ఖచ్చితంగా చెక్‌ చేయాలి.