పుచ్చకాయను న్యాచ్‌రల్‌గా తినండి.. కానీ ఈ పద్దతిలో మాత్రం ట్రై చేయొద్దు..!

ఇలాంటి వారు ఎక్కువగా వాటర్‌ కంటెంట్‌ ఉన్న ఫ్రూట్స్‌, డ్రింక్స్‌ను ఎక్కువగా తీసుకుంటారు. తక్కువ ధరకు దొరికే పుచ్చకాయపై ఎక్కువగా ఆధారపడుతారు.
వేసవిలో పుచ్చకాయ తింటే శరీరం చల్లగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో 92శాతం నీరు మాత్రమే ఉంటుంది. ఇది మన శరీరానికి ఎక్కువ వాటర్ కంటెంట్ అందిస్తుంది.
కానీ కొందరు పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో ఉంచి తింటారు. ఇలా చేయడం వల్ల పోషక విలువలు తగ్గుతాయి.
పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచడం మంచిది. అప్పుడే దీని ప్రయోజనాలు శరీరానికి అందుతాయి.
ఎందుకంటే కట్ చేసిన పుచ్చకాయను ఫ్రిజ్ లో ఉంచితే ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంటుంది.