ఉగాది పచ్చడి తాగుతున్నారా.. దీని గురించి ఈ విషయాలు తెలుసా..!

ఈ రోజున ఉదయమే నిద్రలేచి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేయాలి. అనంతరం ఉగాది పచ్చడి తయారుచేసి తాగి రోజును ప్రారంభిస్తున్నారు.
ఈ పచ్చడి తయారీలో వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి ప్రతీక అని శాస్త్రం చెబుతోంది.
ఈ ఆరు రుచులు ఆనందం, విచారం, కోపం, భయం, ఓర్పు, ఆశ్చర్యం అనే మానవ భావోద్వేగాలను సూచిస్తాయి.
వేప పువ్వు మేలు పలు విధాలుగా ఉంటుంది. వేపపువ్వు చలవ చేస్తుంది.
మిరియపు పొడి శరీరంలో క్రిముల్ని నాశనం చేస్తుంది. మామిడి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉప్పు మన జీర్ణశక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.