ఎండలు ముదరడంతో దాహం విపరీతంగా వేస్తోంది. దీనివల్ల శరీరం డీ హైడ్రేషన్​కు గురయ్యే అవకాశాలు ఉంటాయి.
డీ హైడ్రేషన్​ నివారించడానికి కచ్చితంగా తాగాల్సిన కొన్ని పానీయాలు ఉన్నాయి.
కొబ్బరి నీళ్లు సహజసిద్దమైన పానీయం. ఇవి తాగడం వల్ల శరీరం లోపల నుంచి హైడ్రేట్ అవుతుంది.
.వేసవిలో నిమ్మరసం తాగడం వల్ల శరీరంలో డీ హైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. ఈ నీటిలో నల్ల ఉప్పు, పంచదార, కలుపుకొని తాగితే చాలా మంంచిది.
.ఓఆర్​ఎస్​ తాగడం వల్ల శరీరంలో నీటి లోపాన్ని తొలగించి ఎలక్ట్రోలైట్స్ బ్యాలెన్స్ చేయడంలో సాయపడుతుంది
మీకు ఎండాకాలం వాటర్​ ఎక్కువగా తాగడం ఇష్టం లేకుంటే సింపుల్​గా రకరకాల సూప్​లు తాగడం ఉత్తమం. వీటిని తాగడం వల్ల చాలా సమయం వరకు దాహం వేయకుండా ఉంటుంది.