అతి నిద్ర వల్ల అన్నీ నష్టాలే.. ఆరోగ్యానికి చాలా హాని..!
పెద్దలు రోజూ 7 నుంచి 8 గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.
తక్కువ నిద్ర ఆరోగ్యానికి మంచిది కాదని అందరికి తెలుసు, అలాగే అతి నిద్ర కూడా ఆరోగ్యానికి హానికరం.
ఎక్కువసేపు నిద్రపోతే గుండె ప్రమాదంలో పడుతుంది. ఇది కరోనరీ ఆర్టరీ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
ఎక్కువ నిద్రపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. నిద్రను అదుపు చేసుకోలేని వ్యక్తులు తరచుగా డిప్రెషన్‌కు గురవుతారు.
పరిమితికి మించి నిద్రపోయినప్పుడు శారీరక శ్రమలకు సమయం దొరకదు.తరువాత ఇది మధుమేహం, అధిక రక్తపోటుకు కారణమవుతుంది.