అతిగా మద్యం తాగుతున్నారా.. లివర్‌ ఒక్కటే కాదు ఇవి కూడా కంట్రోల్‌ కావు..!

ఆడ, మగ అనే తేడాలేకుండా తాగుతున్నారు. యువత చాలామంది దీని బారినపడుతున్నారు.
వాస్తవానికి అతిగా మద్యం తాగితే లివర్‌ చెడిపోతుందని అదరికి తెలుసు. కానీ ఇదొక్కటే కాదు శరీరంలో చాలా అవయవాలు దెబ్బతింటాయి.
దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, పొత్తికడుపు నిండుగా ఉండటం వంటి సమస్యలు ఎదురై చివరికి లివర్ దెబ్బతినడం ఖాయమవుతుంది.
చేతులు, పాదాల్లో తిమ్మిర్లు వస్తాయి. జ్ఞాపిక శక్తి తగ్గుతుంది. దీంతో ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక నరాల సమస్యలు వస్తాయి.
మద్యపానం వల్ల ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి మద్యం విషయం లో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం ఉత్తమం.