ఎందుకంటే చలికాలంలో హార్ట్‌ఎటాక్ కేసులు ఎక్కువగా వస్తాయి. కాబట్టి హృద్రోగులు గుండెపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి.
హృద్రోగులు మార్నింగ్ వాక్ కు పూర్తిగా దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లాలంటే సూర్యుడు ఉదయించిన తర్వాతే బయటికి వెళ్లాలి.
కోవిడ్ 19కి ముందు 40 ఏళ్లు పైబడిన వారికి గుండెపోటు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు 20-30 ఏళ్ల యువత కూడా దీని బారిన పడుతున్నారు.
వాకింగ్ లేదా వ్యాయామం చేస్తున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, బరువుగా ఉండటం వంటి సమస్య ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.