చలికాలంలో సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. తెలిస్తే వదలరు..!

సపోటాలో ఉండే పోషకాల వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. సపోటా తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
సపోటాలోని విటమిన్ ఎ ఊపిరితిత్తులు- నోటి క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. ఎముకలను బలపరిచే కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ కూడా సపోటాలో ఉన్నాయి.
జలుబు, దగ్గు సమస్యలతో బాధపడేవారికి కూడా సపోట సంజీవనిలా పనిచేస్తుందట.
జుట్టు రాలడం, చుండ్రు సమస్యలు కూడా ఉండవట. ఊబకాయ సమస్యలతో బాధపడేవారికి కూడా సపోటా మంచిదేనట.
సపోటా రక్తస్రావ నివారిణి కనుక పైల్స్ సమస్య వున్నవారికి ఇది ప్రయోజన కరంగా ఉంటుంది. సపోటా తినడం వల్ల నిద్రలేమి సమస్య దూరమవుతుంది.