మామిడిని ఇలా తీసుకుంటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు.. పైగా క్యాన్సర్, గుండెపోటుకు చెక్..
వేసవిలో ఎక్కువగా లభించే మామిడి కూడా ఆరోగ్యానికి మంచిదేనని వివరిస్తున్నారు.
గుండె ఆరోగ్యం.. శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి, చెడు కొలెస్ట్రాల్‌ని శరీరం నుంచి తొలగిస్తాయి, ఫలితంగా గుండెపోటు వంటి సమస్యలు మీ దరి చేరవు.
వడదెబ్బ.. వేసవిలోనే ప్రధానంగా లభించే మామిడికాయ హీట్ స్ట్రోక్ లక్షణాలను తగ్గించడంలో మెరుగ్గా ఉపయోగపడుతుంది.
రోగనిరోధక శక్తి.. మామిడికాయలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్లు మన తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచుతాయి.